
ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ నాయకత్వం పాకా వెంకట సత్యనారాయణను ఎంపిక చేసింది. భీమవరానికి చెందిన పాకా వెంకట సత్యనారాయణ ఏపీ బీజేపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో భీమవరం కౌన్సిలర్ గా కూడా పాకా వెంకట సత్యనారాయణ పనిచేశారు. నేరుగా కౌన్సిలర్ నుంచి రాజ్యసభ పదవికి ఎంపికయ్యారు.
పార్టీని అంటిపెట్టుకుని…
పార్టీని అంటిపెట్టుకుని, సుదీర్ఘకాలంగా అనేక ఏళ్లుగా బీజేపీతో కలసి నడుస్తున్న పాకా వెంకట సత్యనారాయణకు అనూహ్యంగా కేంద్ర నాయకత్వం ఎంపిక చేసింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీలో బీజేపీ తన అభ్యర్థిని నిలపెట్టాలని నిర్ణయించింది. రేపు పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ వేయనున్నారు. రేపు నామినేషన్లకు చివరి గడువు కావడంతో నేడు బీజేపీ అధినాయకత్వం పాకా వెంకట సత్యనారాయణ పేరును ఖరారు చేసింది