
దక్షిణ కొరియా కంపెనీకి చెందిన Hyundai కంపెనీ ఇప్పటికే ఎన్నో మోడళ్లను భారత మార్కెట్లో పరిచయం చేసింది. అయితే వీటిలో కొన్ని కార్లు మాత్రమే సక్సెస్ అయ్యాయి. వీటిలో Creta గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ మోడల్ డ్రైవింగ్ లో కొత్త అనుభూతి ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ CVT, ఆటోమేటిక్ DCT ఆప్షన్లు ఉన్నాయి. వీటితో పాటు ఆటోమేటిక్ గేర్ ఆప్షన్ తో ఈ కారు పనిచేస్తుంది. అలాగే ఇందులో చైల్డ్ సేప్టీతో పాటు అడల్స్ సేప్టీ ఫీచర్లు ఉన్నాయి. దీనిని మార్కెట్లో రూ.12.94 లక్షల ప్రారంభం నుంచి రూ. 24.15 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
దేశంలో కార్ల ఉత్పత్తిలో అగ్రగామి ఉన్న కంపెనీల్లో Mahindra ఒకటి. ఈ కంపెనీకి చెందిన XUV 700 కారు కంపోర్ట్ డ్రైవింగ్ ఉంటుంది. ఇది మొత్తం 66 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారుకు డిమాండ్ ఏర్పడడంతో దీని కోసం కొన్ని రోజుల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో ఆటోమేటిక్ DCతో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ ఉంటుంది. సేప్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన ఈ కారు మార్కెట్లో రూ.21.68 లక్షల ప్రారంభం నుంచి రూ. 30.88 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
డ్రైవింగ్ లో కంపోర్ట్ అనిపించే మరో కారు టయోటా ఇన్నోవా హైక్రాస్. కుటుంబ సభ్యులందరితో కలిసి దూర ప్రయాణాలు చేయాలనుకునేవారికి ఈ కారు బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. ఈ కారులో వెళితే ఎంతో హాయిగా ఉంటుంది. దీనిని మార్కెట్లో రూ. 23.29 లక్షల ప్రారంభ ధర నుంచి రూ. 38.04 లక్షల వరకు విక్రయిస్తున్నారు. మొత్తం 11 వేరియంట్లో అందుబాటులో ఉన్న ఈ కారు కోసం వినియోగదారులు క్యూ కడుతున్నారు.
దేశంలో అత్యధికంగా విక్రయాలు జరుపుకుంటున్న మరో కంపెనీ కియా. ఈ కంపెనీకి చెందిన సోనెట్ కారు ది బెస్ట్ అనిపించకుంటుంది. దీనిని రూ. 8.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. మొత్తం 20 వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు దూర ప్రయాణానికి అనువుగా ఉంటుంది. ఇందులో డీసీటీ, టార్క్ కన్వర్టర్ అనే రెండు గేర్ బాక్స్ లు ఉండడంతో దీని కోసం వినియోగదారులు ఆరాటపడుతున్నారు. మంచి డ్రైవింగ్ అనుభూతి పొందాలనుకునేవారికి ఈ కారు బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది.