
లిబరేషన్ ఆర్మీ ఏమంటున్నదంటే..
“ఎన్నో సంవత్సరాల పోరాటమిది. ఎన్నో త్యాగాలకు లభించిన గుర్తింపు ఇది.. దీనివల్ల మేము సాధించిన స్వేచ్ఛ మామూలుది కాదు. మేము అనుభవిస్తున్న స్వాతంత్రం మాటలకు అందదు. ఇదంతా కూడా యోధులు చేసిన త్యాగాల ఫలితం. కచ్చితంగా మమ్మల్ని మేము గొప్పగా పాలించుకుంటాం. గొప్పగా అభివృద్ధి చేసుకుంటాం. ప్రపంచం మొత్తం మా వైపు చూసే విధంగా అడుగులు వేస్తామని” లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. మరోవైపు ఉగ్రవాద దేశం నుంచి విడిపోయి తాము స్వాతంత్ర దేశంగా ఏర్పడ్డామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వెల్లడించింది. ప్రభుత్వ ఏర్పాటుకు సలహాలు చేస్తున్నామని వెల్లడించింది. అంతేకాదు క్వెట్టా నగరంలో కొత్త పార్లమెంట్ ఫోటోలను.. జాతీయ చిహ్నాన్ని.. జాతీయ గీతాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది. అంతేకాదు భారతి నుంచి మొదలుపెడితే ఇతర దేశాలలో తమ ఎంబసీలు ఏర్పాటు చేయాలని వెల్లడించింది. పాకిస్తాన్ నుంచి తాము స్వాతంత్ర కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నామని.. అది అంతిమంగా ఇప్పుడు వాస్తవరూపం దాల్చిందని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వెల్లడించింది..” ఇది మా పోరాటానికి దక్కిన ఫలితం. మా త్యాగాలకు లభించిన గౌరవం. ఇదంతా సజీవ రూపంలో ఇప్పుడు కనిపిస్తోంది. ఇంతకుమించినా ఆనందం మరొకటి ఉండదని” బలూచిస్తాన్ ఆర్మీ అభిప్రాయపడుతోంది.