
నటసింహం నందమూరి బాలయ్య బాబు (Balayya Babu) హీరోగా వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులందరిని మెప్పిస్తూ భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటాయి. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకుడిని ఎక్కడ కూడా నిరాశపరచదు. మాస్ ప్రేక్షకుల పల్స్ తెలుసుకున్న హీరోగా బాలయ్య బాబుకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా బీ,సీ సెంటర్ లలో 100 డేస్ ఆడటమే కాకుండా ఆయనకు మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను కూడా సంపాదించి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు కూడా ఆయన చేస్తున్న సినిమాలు మాస్ సినిమాలే కావడం విశేషం… మరి ఏది ఏమైనా ఇకమీదట చేయబోతున్న సినిమాలతో భారీ విజయాలను అందుకొని తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్న బాలయ్య బాబు ఈ ఏజ్ లో సైతం భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు.
ఇక ఇప్పటికే ఏ సీనియర్ హీరోకి సాధ్యం కానీ రీతిలో వరుసగా నాలుగు విజయాలను సాధించి తను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకున్నాడు. ఇకమీదట రాబోయే సినిమాలతో కూడా మంచి విజయాలను అందుకొని ఆయనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా గుర్తింపును సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…
ఇక తన కూతురు అయిన తేజస్విని (Trjashwini)కి బాలయ్య బాబు నటించిన సినిమాల్లో ‘సమరసింహారెడ్డి’ (Samara Simha Reddy) సినిమా అంటే చాలా ఇష్టమట. ఆ సినిమా మొదటి ఫ్యాక్షనిస్ట్ సినిమాగా రావడమే కాకుండా బాలయ్య బాబు లోని పూర్తి నటనని బయటకు తీసిందని ఆయనలో రౌద్రం ఆ రేంజ్ లో ఉందనే విషయం అందరికి అప్పుడే తెలిసిందని అందులో బాలయ్య బాబు చెప్పే డైలాగులు అద్భుతంగా ఉంటాయని ఆమె పలు సందర్భాల్లో తెలియజేశారు.
మొత్తానికైతే వాళ్ల నాన్న అయిన బాలయ్య బాబు చేసిన సినిమాల్లో సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా పలు రికార్డులను సైతం క్రియేట్ చేసింది. అలాంటి సినిమాని ఇష్టపడిన తేజస్విని అందుకే బాలయ్య బాబు కోసం సపరేట్ గా కొన్ని స్టోరీలను కూడా రెడీ చేయించి అతనితో సినిమాలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తుంది.