
Bakrid: 190 కేజీల శిరోలి గొర్రెకు రూ.3 లక్షల విలువ!Bakrid: బక్రీద్ పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా గొర్రెల మార్కెట్లు సందడిగా మారాయి. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఓ అరుదైన శిరోలి జాతి గొర్రె అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మంగళవార బజార్‌కు చెందిన తౌఫిక్ కళ్యాణి తన ఇంటి వద్ద ఈ 190 కిలోల గొర్రెను ప్రేమగా సంరక్షిస్తున్నారు.
ఈ గొర్రెను తౌఫిక్ మధ్యప్రదేశ్‌లోని దేవాస్ గ్రామం నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. రోజూ పాలతో పాటు మొక్కజొన్న, గోధుమ, జొన్నలు, రావి ఆకులతో పోషణ ఇస్తున్నారు. శిరోలి జాతికి చెందిన ఈ గొర్రెను పండుగలో బలిగా కాకుండా భక్తి సంకేతంగా పెంచుతున్నట్లు తెలిపారు.
ఈ గొర్రె ధర దాదాపు రూ.3-4 లక్షలుగా అంచనా వేస్తున్నా, తౌఫిక్ దానిని అమ్మే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఈ గొర్రెను చూసేందుకు పెద్ద సంఖ్యలో తౌఫిక్ ఇంటికి వస్తున్నారు.
ఇక బక్రీద్ నేపథ్యంలో సోలాపూర్ మార్కెట్లు గొర్రెల అమ్మకాలతో కళకళలాడుతున్నాయి. శిరోలి, అజ్మేరీ, రాజస్థానీ, తోతాపురి వంటి వివిధ జాతుల గొర్రెలు మార్కెట్లోకి వచ్చాయి. ముస్లిం సోదరులు పవిత్ర బలికై ప్రత్యేకంగా గొర్రెలను కొనుగోలు చేస్తున్నారు.