
Arjun of Vyjayanthi : టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలు లేక థియేటర్స్ బోసిపోయాయి. అనేక ప్రాంతాల్లో షోస్ ని నడుపుకోలేక థియేటర్స్ ని మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంక్రాంతికి విడుదలైన ఒకే ఒక్క పెద్ద హీరో సినిమా ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది. అదే సంక్రాంతికి విడుదలైన ‘డాకు మహారాజ్'(Daaku Maharaj), ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) వంటి చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఇక ఆ తర్వాత ఆ స్థాయి సూపర్ హిట్ సినిమాలు రాలేదు. మధ్యలో ‘తండేల్’, ‘డ్రాగన్’,’మ్యాడ్ స్క్వేర్’ వంటి చిత్రాలు వచ్చి పెద్ద హిట్ అయ్యాయి కానీ, అవేమి నెలల తరబడి థియేటర్స్ లో ఆడే రేంజ్ సినిమాలు కావు. ఆ స్థాయి థియేట్రికల్ రన్ ఉండాలంటే కచ్చితంగా పెద్ద హీరో సినిమా విడుదలై సూపర్ హిట్ అవ్వాలి. విచిత్రం ఏమిటంటే సమ్మర్ మొదలై ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఒక్క పెద్ద హీరో సినిమా కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
థియేటర్స్ లో ఈగలు తప్ప మనుషులు కనపడని పరిస్థితి. అలాంటి సమయంలో నిన్న విడుదలైన నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) ‘అర్జున్ S/O వైజయంతి'(Arjun S/O Vyjayanthi) చిత్రం విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ ఓపెనింగ్స్ అంతంత మాత్రంగానే వచ్చాయి. ఈ చిత్రానికి మొదటి రోజు ఆన్లైన్ లో ట్రాక్ అయినా 1861 ఇండియా వైడ్ షోస్ నుండి వచ్చిన 2 కోట్ల 87 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు కాగా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 4 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది కేవలం ఆన్లైన్ ద్వారా ట్రాక్ అయిన షోస్ నుండి వచ్చిన గ్రాస్ మాత్రమే. ఓవరాల్ గా కలిపి ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. షేర్ వసూళ్లు దాదాపుగా 2 కోట్ల 67 లక్షల రూపాయిలు వచ్చాయి.
కానీ ఇది బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఏ మాత్రం సరిపోదు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కచ్చితంగా 23 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. అంటే ఇంకా 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రావాలి, కాబట్టి నేడు, రేపు భారీ వసూళ్లను నమోదు చేసుకోవడం తప్పనిసరి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి ప్రస్తుతం గంటకు రెండు వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోతున్నాయి. ట్రెండ్ చూస్తుంటే నిన్న వచ్చిన కలెక్షన్స్ ఈరోజు కూడా వచ్చేలా ఉంది. అలా మొదటి వీకెండ్ ఈ చిత్రానికి కనీసం పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా వచ్చేలా లేదు. లాంగ్ రన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే ఈ చిత్రాన్ని ఆదుకోగలరు. చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది.