
రాత్రిపూట నిద్రపోవడానికి చాలా ప్రయత్నించినా నిద్రపోలేకపోతున్నారా? పగటిపూట అలసట, ఒత్తిడి, దిక్కుమాలిన ఫోన్, పని కారణంగా రాత్రిపూట నిద్రపోవడం కష్టం కావడం ఇప్పుడు ఒక సాధారణ సమస్యగా మారింది. నిద్ర లేకపోవడం వల్ల, రోజంతా చిరాకు, సోమరితనం ఎదురవుతాయి. ఇది మొత్తం రోజను పాడు చేస్తుంది.
తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే, ఇక్కడ కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. వీటిని పాటించడం వల్ల మీరు మీ నిద్రను మెరుగుపరచుకోవచ్చు. మీరు పడుకున్న వెంటనే, ఫోన్ ను పక్కన పెట్టి మరీ నిద్రపోతారు.
4-7-8 టెక్నిక్
రాత్రి నిద్ర పట్టకపోతే, మొదట మంచం మీద పడుకుని 4 సెకన్ల పాటు లోతైన శ్వాస తీసుకోండి. ఆపై 7 సెకన్ల పాటు శ్వాసను పట్టుకోండి. దీని తరువాత, 8 సెకన్ల పాటు గాలిని వదులుకోండి. ఈ ప్రక్రియ మీ శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది. ఇలా చేస్తే మీరు చాలా త్వరగా నిద్రపోతారు.
పడుకునేటప్పుడు సాక్స్
మీరు బాగా నిద్రపోవాలనుకుంటే, పడుకునేటప్పుడు సాక్స్ ధరించండి. సాక్స్ ధరించడం వల్ల మీ పాదాలలో వేడి ఉత్పత్తి అవుతుంది. ఇది మీ శరీరాన్ని చల్లగా చేస్తుంది. అంటే అటోమెటిక్ గా నిద్ర ఆసన్నమైందని మీ మెదడుకు సంకేతాలను పంపుతుంది. ఇది నిద్రను మెరుగుపరుస్తుంది. రాత్రిపూట సాక్స్లతో పడుకునే వారు 32 నిమిషాలు ఎక్కువసేపు నిద్రపోతారని, తక్కువ సార్లు మేల్కొంటారని ఒక అధ్యయనంలో తేలింది.
లావెండర్ నూనె వాసన
లావెండర్ ఆయిల్ సువాసన కూడా నిద్రకు సహాయపడుతుంది. లావెండర్ మన మనస్సును ప్రశాంతంగా, రిలాక్స్‌గా ఉంచే కొన్ని సమ్మేళనాలను కలిగి ఉంటుంది. లావెండర్ సువాసన ఒత్తిడిని తగ్గిస్తుందని, హృదయ స్పందన రేటు, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుందని క్లినికల్ ట్రయల్స్ నిరూపించాయి. మీరు నిద్రపోలేకపోతే, మీరు లావెండర్ నూనెను ఉపయోగించవచ్చు.