
అయితే, టూవీలర్స్ అంటే బైక్‌లు, స్కూటర్ల అమ్మకాలు మాత్రం కొంచెం తగ్గాయి. ఏప్రిల్‌లో వీటి అమ్మకాలు 17 శాతం తగ్గి 14,58,784 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో ఈ సంఖ్య 17,51,393 యూనిట్లుగా ఉంది. స్కూటర్ల అమ్మకాలు గత నెలలో 5,48,370 యూనిట్లుగా ఉన్నాయి. ఇది 2024 ఏప్రిల్‌లో 5,81,277 యూనిట్ల కంటే ఆరు శాతం తక్కువ. మోటార్‌సైకిళ్ల అమ్మకాలు ఏకంగా 23 శాతం తగ్గి 8,71,666 యూనిట్లకు పడిపోయాయి. మోపెడ్ల అమ్మకాలు కూడా 8 శాతం తగ్గి 38,748 యూనిట్లుగా నమోదయ్యాయి.
కొత్త రూల్స్
ఏప్రిల్ 2025 నుంచి టూవీలర్స్, త్రీవీలర్స్‌లో కొత్త రూల్స్ వచ్చాయని మీనన్ తెలిపారు. ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్ (OBD) 2 రెగ్యులేషన్ రెండో దశ అమల్లోకి వచ్చిందని చెప్పారు. అంతేకాకుండా, ఈ నెల నుంచి దేశవ్యాప్తంగా ఈ-20 పెట్రోల్‌తో నడిచే వాహనాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ-20 పెట్రోల్ అంటే 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్‌తో కలిపిన ఇంధనం అన్నమాట.
అద్దెకు ఎలక్ట్రిక్ వెహికల్స్
మరోవైపు, టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ ట్రాన్స్‌పోర్టేషన్ సొల్యూషన్స్ అందించే వర్టెలోతో చేతులు కలిపింది. టాటా మోటార్స్ అన్ని ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లలో అద్దె సర్వీసులను అందించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కౌల్ మాట్లాడుతూ.. వర్టెలోతో ఈ భాగస్వామ్యం ఎలక్ట్రిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను ప్రజలకు చేరువ చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించారు.