
* మద్యం పాలసీని మార్చి..
2019లో అధికారంలోకి వచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ). అప్పటివరకు ఉన్న మద్యం పాలసీని మార్చింది. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నడిపింది. అయితే అప్పటి వరకు ఉన్న ప్రీమియం బ్రాండ్ల స్థానంలో నాసిరకం మద్యం అందుబాటులోకి తెచ్చిందన్న విమర్శలు వచ్చాయి. దేశంలో ఎక్కడా చూడని.. వినని మద్యం బ్రాండ్లు ఏపీలో దర్శనం ఇచ్చాయి. మద్యం ధరను కూడా అమాంతం పెంచేసింది. అయితే ఐదేళ్లపాటు మద్యం ఆదాయం భారీగా సమకూరింది. ఇప్పుడు మద్యం కుంభకోణం బయటకు రావడంతో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 2014 నుంచి 2019 వరకు పాలించిన టిడిపి సర్కార్ మద్యం ఆదాయం 70,476 కోట్లు.. అదే 2019 నుంచి 2024 మధ్య వైసీపీ సర్కార్లో మద్యానికి వచ్చిన ఆదాయం అక్షరాల 1,06,065 కోట్లుగా చెబుతోంది. ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే మద్యం స్కాం ఎలా జరిగింది అన్నది లాజిక్ ప్రశ్న వేస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. వైసిపి సానుభూతి విశ్లేషకులు సైతం ఇదే విషయాన్ని హైలెట్ చేస్తున్నారు.
* ఆదాయం సరే.. కమీషన్ల మాటేంటి?
అయితే ఏపీలో వైసీపీ పాలనలో ఒక్కసారిగా మద్యం ధర పెరిగింది. నాసిరకం బ్రాండ్లు రెట్టింపు చేసి అమ్ముకున్నారు. 2019 ఎన్నికలకు ముందు క్వార్టర్ మద్యం 110 రూపాయలు ఉంటే.. ఎన్నికల అనంతరం వైసిపి ప్రభుత్వం 220 రూపాయలకు పెంచింది. ప్రీమియం బ్రాండ్ బీరు ధర 100 నుంచి 120 రూపాయలు ఉంటే.. దానిని 240 రూపాయలకు పైగా పెంచింది. నాసిరకం మద్యంతో ఎక్కువ ఆదాయం సమకూరింది. అయితే ఇక్కడే వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియాకు అంతు పట్టని ఒక విషయం అర్థమవుతుంది. ప్రభుత్వానికి ఆదాయం పెరిగిన మాట వాస్తవమే. కానీ డిష్టలరీలు, మద్యం సరఫరా చేసే కంపెనీల నుంచి పెద్ద ఎత్తున కమీషన్లు దండుకొని అనుమతులు ఇచ్చారన్నదే ప్రధాన ఆరోపణ. ప్రభుత్వానికి మద్యం ఆదాయం సరే.. కానీ ఒక్కో బాటిల్ వద్ద 50 రూపాయలు చొప్పున కమీషన్ దండుకున్నారు అన్నదే ప్రధానంగా ఆరోపించే విషయం. కానీ వైసిపి సోషల్ మీడియా, ఆ పార్టీ అనుకూలూరు మాత్రం ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని మాత్రమే చెబుతున్నారు. కానీ కమీషన్ల రూపంలో దండుకున్న విషయాన్ని మరిచిపోతున్నారు. అయితే లాజిక్కుల పేరుతో.. మద్యం కుంభకోణాన్ని తక్కువగా చూపే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు.
ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే లిక్కర్ స్కామ్ జరిగినట్టా లేక తగ్గితే స్కామ్ జరిగినట్టా…??
బాబోరీ ప్రభుత్వంలో 70,476 కోట్లు ఆదాయం వస్తే జగన్ ప్రభుత్వంలో 1,06,065 కోట్లకి పెరిగింది…!!
పైగా జగన్ హయాంలో లిక్కర్ సేల్స్ తగ్గింది అయినా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది…మరి స్కామ్ ఎక్కడ… pic.twitter.com/rfjukY2e2H
— Power_Ranger_Facts (@Neninthae_) May 14, 2025