
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గిరిజనులకు వారికి అక్కడే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. వంద శాతం ఉద్యోగాలను ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకే ఇస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, గైడ్ లైన్స్ ను పాటిస్తూనే 2020 లో రద్దయిన జీవో నెంబరు 3 పునరుద్ధరణకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
జీవో నెంబరు 3 పునరుద్ధరణపై…
జీవో నెంబరు 3 పునరుద్ధరణపై గిరిజనులు, గిరిజన సంఘాల అభిప్రాయాలను తెలుసుకోవాలని ఆదేశించారు. ఆ జీవో ద్వారా అందే లబ్దిని గిరిజనులకు తిరిగి అందించేందుకు అన్ని అవకాశాలను పరిశీలించాలని అధికారులను కోరారు. గిరిజనుల సమస్యల పరిష్కారం పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చంద్రబాబు తెలియజేశారు. గిరిజన సంఘాలు కూడా దీనిపై ఆందోళన చేయాలని ఆయన కోరారు. జీవో నెంబరు 3ని పునరుద్ధరించే విషయంలో రాజ్యాంగ నిపుణులతో చర్చించాలని కూడా చంద్రబాబు అధికారులను ఆదేశించారు.