
ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. డీసీఎంఎస్ ఛైర్మన్లను జిల్లాలకు ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పది జిల్లాలకు సహకార బ్యాంకుల ఛైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా నెట్టెం రఘురాంను నియమించింది. శ్రీకాకుళం డీసీసీబీ ఛైర్మన్ గా శివ్వల సూర్యనారాయణ, విశాఖ డీసీసీబీ ఛైర్మన్ గా జనసేనకు చెందిన కోన తాతారావును నియమించింది. విజయనగరం డీసీసీబీ ఛైర్మన్ గా కిమిడి నాగార్జులన, గుంటూరు డీసీసీబీ ఛైర్మన్ గా మాకినేని మల్లికార్జున రావు, నెల్లూరు డీసీసీబీ ఛైర్మన్ గా ధనుంజయ్ రెడ్డి, చిత్తూరు జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా రాజశేఖర్ రెడ్డి, అనంతపురం డీసీసీబీ ఛైర్మన్ గా కేశవరెడ్డి, కర్నూలు డీసీసీబీ ఛైర్మన్ గా డి.విష్ణువర్ధన్ రెడ్డి, కడప డీసీసీబీ ఛైర్మన్ గా బి. సూర్యనారాయణరెడ్డిని నియమించారు.