
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిని ప్రత్యేకంగా గుర్తించి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లో లేని వెసులుబాటును ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 8వ తేదీనుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. చెప్పిందే తడవుగా లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చిపడుతున్నాయి. అయితే తాజాగా మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పిన దాని ప్రకారం ఒంటరిగా నివసించే మహిళలు, పురుషులతో పాటు యాభై ఏళ్లు నిండినా వివాహం కాని వారికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తారు.అలాగే విడిపోయిన భార్యాభర్తలకు,అనాధాశ్రమంలో నివసించే వృద్ధులు, లింగమార్పిడి చేసుకున్న వారు కూడా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఎల్లుండి నుంచి…
అలాగే పింఛన్లు పొందుతున్న కళాకారులతో పాటు కొండ ప్రాంతాలకు చెందిన పన్నెండు మంది తెగల ప్రజలకు కూడా ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వీరికి అంత్యోదయ అన్న యోజనకార్డులు అందచేస్తామని మంత్రి నాదెండ్ల చెప్పారు. దీంతో పాటు ఎల్లుండి నుంచి కొత్తరేషన్ కార్డులు పొందాలంటే గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరంలేదు. వాట్సాప్ ద్వారా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనుననారు. ఎల్లుండి నుంచి వాట్సప్ గవర్నెన్స్ విధానం ప్రజలకుఅందుబాటులోకివస్తుందనితెలిపారు. 9552300009 నెంబరకు Hello అని మెసేజ్చేస్తే చాలు నూతన కార్డులను పొందవ్చు.అలాగే ప్రస్తుతమున్నకార్డుల్లో చిరునామా మార్చుకోవచ్చు.
వారికి మినహాయింపు…
కుటుంబ సభ్యుల పేర్లు తొలగించవచ్చు. కొత్తగా చేర్చవచ్చు. కార్డులను కూడా సరెండర్ చేయవచ్చు.సులువుగా ఈ విధానాన్నిఉపయోగించుకోవాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం దాదాపు 1.50 కోట్ల మేరకు రేషన్ కార్డులున్నాయి.ఈ కార్డులద్వారా4.24కోట్ల మంది లబ్దిపొందుతున్నారు.అయితే ఎనభై ఏళ్లుదాటినవారుమాత్రంఈ కేవైసీ చేసుకునే అవసరంలేదు. వారికి మినహాయింపు ఇచ్చినట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. కొత్తగా జారీచేసే కార్డులన్నీ స్మార్ట్ కార్డులు. మన బ్యాంకు డెబిట్ కార్డు అంత సైజులో ఉంటాయి. అందులో క్యూఆర్ కోడ్ ద్వారా కుటుంబ సభ్యులసమాచారం మొత్తం తెలుస్తుంది. ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసిన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రినాదెండ్ల మనోహర్ చెప్పారు.