
ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయని నాదెండ్ల మనోహర్ చెప్పారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద సరుకులు పంపిణీ చేసేలా రాష్ట్రవ్యాప్తంగా 1. 46 కోట్ల మందికి రైస్ కార్డులు అందించామని నాదెండ్ల మనోహర్ తెలిపార.
ఇప్పటికే తొంభయి శాతం…
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ తొంభయి శాతం ఈ-కేవైసీ పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 72,500 మంది స్మార్ట్ కార్డులు పొందారన్న నాదెండ్ల నూతనంగా 10,747 మంది కార్డులు పొందారని చెప్పారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.