
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు సిద్ధమవుతున్నారు. పనితీరును బట్టి స్థాన చలనం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి కావడంతో అధికారుల పనితీరును ప్రాతిపదికగా తీసుకుని జూన్ నెలలో పెద్దయెత్తున ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు ఉంటాయన్న సమాచారం అందుతుంది.
జూన్ మొదటి వారంలో…
జూన్ మొదటి వారంలో రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానాచాలనం ఉంటుందని తెలిసింది. తొలుత కలెక్టర్ల బదిలీలపై దృష్టి పెట్టి తదుపరి ఐపీఎస్ ల బదిలీలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేయనున్నట్లు సమాచారం. కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏడాది పూర్తైయ్యే లోపు పలు జిల్లాలో ప్రధానమైన ఉన్నతాధికారుల బదిలీకి ప్రభుత్వం.. సిద్ధం చేసింది