
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బెంగళూరులో కలుసుకుంటున్నారు.ఒకే వేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచుకుంటున్నారు. ఈ నెల 9వ తేదీన ఈ నెల 9న బెంగళూరుకు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి లు హాజరు కానున్నారు. ఓ మీడియా సంస్థ సదస్సులో పాల్గొననున్న ఇద్దరు సీఎంలు వివిధ అంశాలపై చర్చించనున్నారు.
వేర్వేరు అంశాలపై…
సదస్సులో పాల్గొననున్న కేంద్రమంత్రులు, పలువురు ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. సామాజిక న్యాయం, తెలంగాణ ప్రభుత్వం సర్వేపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్వాంటమ్ వ్యాలీ, ఎడ్యుకేషనల్ హబ్స్, సంకీర్ణ రాజకీయాలు, సుపరిపాలనపై ప్రసంగించనున్నారు.