
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పోస్టులను వరసగా భర్తీ చేస్తున్నారు. మహానాడు లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలన్న ఉద్దేశ్యంతో త్వరితగతిన నియామకాలు చేపట్టారు. టీడీపీ నుంచి పదహారు మందికి, జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి, అమరావతి ఐక్య కార్యాచరణ సమితి నుంచి ఒకరికి పదవులు లభించాయి. గత ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని ఎమ్మెల్యే అభ్యర్థులకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చి గౌరవించారు. తమ స్థానాలను త్యాగం చేసిన వారికి ఈ పోస్టులను చంద్రబాబు ఇచ్చారు.
కీలకమైన నేతలకు…
నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు ఎనిమిది, ఎస్సీలకు, రెండు, ఎస్టీలకు ఒక పదవి క్కాయి. మాజీ మంత్రి కేఎస్ జవహర్ కు ఎస్సీ కమిషన్ ఛైర్మన్ గా నియమించారు. తుడా ఛైర్మన్ గా దివాకర్ రెడ్డిని నియమించారు. రాజధాని అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాయలపాటి శైలజకు మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ గా నియమించారు. విధ్వంసం పేరిట రచించిన ఆలపాటి సురేష్ ను ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా నియమించారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఎం. సుగుణమ్మను గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా చంద్రబాబు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు మరికొందరికి కీలకపదవులు దక్కాయి.
పోస్టులు దక్కిన వారు :
1. ఆంధ్రప్రదేశ్ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ బోర్డు ఛైర్మన్ గా – డా. జెడ్. శివ ప్రసాద్ – నెల్లూరు సిటీ – టీడీపీ
2. ఆంధ్రప్రదేశ్ విద్య సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ గా ఎస్. రాజశేఖర్ – కుప్పం – టీడీపీ
3. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ గా సుగుణమ్మ – తిరుపతి – టీడీపీ
4. ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ గా వెంకట శివుడు యాదవ్ -గుంతకల్ -టీడీపీ
5. ఆంధ్రప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు ఛైర్మన్ గా వలవల బాబ్జీ -తాడేపల్లిగూడెం – టీడీపీ
6. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ గా బురుగుపల్లి శేషారావు – నిడదవోలు – టీడీపీ
7. ఆంధ్రప్రదేశ్ మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ ఛైర్మన్ గా పీతల సుజాత – భీమవరం – టీడీపీ
8. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ గా దివాకర్ రెడ్డి – తిరుపతి – టీడీపీ
9. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ గా వాణి వెంకట శివ ప్రసాద్ పెన్నుబోయిన – ఏలూరు – టీడీపీ
10. ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్టీ సొసైటీ ఛైర్మన్ గా డా. రవి వేమూరు – తెనాలి – టీడీపీ
11. ఆంధ్రప్రదేశ్ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా మలేపాటి సుబ్బా నాయుడు -కావలి -టీడీపీ
12. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ గా కె.ఎస్. జవహర్ – కొవ్వూరు – టీడీపీ
13. ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య ఛైర్మన్ గా పెదిరాజు కొల్లు – నరసాపురం – టీడీపీ
14. ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ గా పేరేపి ఈశ్వర్ – విజయవాడ ఈస్ట్ – టీడీపీ
15. ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ గా మల్లెల ఈశ్వరరావు -గుంటూరు వెస్ట్ – టీడీపీ
16. ఆంధ్రప్రదేశ్ టైలర్ అభివృద్ధి సహకార సమాఖ్య ఆకాసపు స్వామి – తాడేపల్లిగూడెం – టీడీపీ
17. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ లీలకృష్ణ – మండపేట – జనసేన పార్టీ
18. ఆంధ్రప్రదేశ్ లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఛైర్మన్ గా రియాజ్ – ఒంగోలు – జనసేన పార్టీ
19. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ గా డా. పసుపులేటి హరి ప్రసాద్ – తిరుపతి – జనసేన పార్టీ
20. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ ఛైర్మన్ గా సోల్ల బోజ్జి రెడ్డి – రంపచోడవరం – భారతీయ జనతా పార్టీ
21. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా రాయపాటి శైలజ – అమరావతి జేఏసీ
22. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా ఆలపాటి సురేష్ – అమరావతి జేఏసీ