
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 20వ తేదీన జరగనుంది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా వచ్చే నెల పన్నెండో తేదీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది పూర్తికావస్తుండటంతో చేపట్టాల్సిన కార్యక్రమాలతో పాటు వివిధ రకాల అంశాలను చర్చించి మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపే అవకాశముంది. ముఖ్యంగా భూముల కేటాయింపు విషయంపై చర్చించనున్నారు.
ఏడాది పాలనపై…
దీంతో పాటు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రజల్లో విస్తృతంగా కార్యక్రమాలను చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం, పారిశ్రామిక సంస్థల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన, హామీల అమలుపై ప్రజల్లోకి విస్తృతంగా ఎలా తీసుకెళ్లగలగాలన్న దానిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.