
దీనిని వైసీపీ పార్టీ నాయకులు ఒక రేంజ్ లో సోషల్ మీడియా అంతటా వ్యాప్తి చేసి, పవన్ కళ్యాణ్ అవసరం తీరిపోయింది, ఆయన పేరు తప్పించారు అంటూ ప్రచారం చేశారు. అయితే అసలు వాస్తవాన్ని కూటమి నాయకులు ఆ తర్వాత బయటపెట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆహ్వాన పత్రిక ని తీసుకొని, ఇలా కూటమి నాయకుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, కానీ ప్రధాని కి కాకుండా, మిగిలిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మరియు ఇతర నాయకులకు అందించిన ఆహ్వాన పత్రిక లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పేరుతో పాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉందని ఆధారాలతో సహా ఫోటోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేసారు. దీంతో ఉదయం నుండి జరుగుతున్న గొడవలకు తెరపడింది. వైసీపీ పార్టీ నాయకులు ఇలా కూటమికి బీటలు వాటిల్లేలా ప్రచారాలు చేస్తూనే ఉంటారని, దయచేసి వాటిని నమ్మి మోసపోవద్దు అంటూ కూటమి అభిమానులు చెప్తున్నారు.
మే 2న జరగబోయే సభా వేదిక పై కేవలం 14 మంది మాత్రమే కూర్చునేందుకు ఏర్పాట్లు చేసారని. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గవర్నర్ లతో పాటు, కేంద్ర మినిస్టర్స్ కూడా కూర్చునేలా ఏర్పాట్లు చేసారని, మిగిలిన వాళ్ళు VIP గ్యాలరీ లో కూర్చుంటారని తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరికొన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా మీడియా కి విడుదల చేయనుంది ప్రభుత్వం.