
ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ఇండియాలో రూ. 2వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడులు ప్రధానంగా కంపెనీ కార్యకలాపాల మౌలిక సదుపాయాల విస్తరణ, డెలివరీ వేగాన్ని పెంచడానికి, ఉద్యోగుల సంక్షేమానికి ఉపయోగించనుంది.
అమెజాన్ ఈ పెట్టుబడితో భారతదేశంలో కొత్త ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, సార్టేషన్ హబ్‌లు, డెలివరీ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. అలాగే ఇప్పటికే ఉన్న వాటిని అప్‌గ్రేడ్ చేసి, లేటెస్ట్ టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది.
డెలివరీ బాయ్‌లకు విశ్రాంతి కేంద్రాలు, ఎకనామికల్ ఎడ్యుకేషనల్ కార్యక్రమాలు, ఆరోగ్య సేవలు వంటి సంక్షేమ చర్యలను కూడా ఈ పెట్టుబడులలో భాగంగా చేపట్టనున్నారు. ఇది ఉద్యోగాల కల్పనతో పాటు, స్థానిక వ్యాపారాలకు కూడా సహాయపడుతుందని భావిస్తుస్తోంది అమెజాన్ యాజమాన్యం.