
ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ ని అత్యధిక శాతం మంది పాకిస్తానీయులు, బాంగ్లాదేశ్ కి సంబంధించిన వాళ్ళు అనుసరిస్తూ ఉంటరారు. నిన్న అర్థ రాత్రి పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం గా మన ఇండియన్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్'(Operation Sindoor) లో వంద మందికి ఉగ్రవాదులు హతమైన సంగతి మన అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో ప్రతీ సెలబ్రిటీ ఇండియన్ ఆర్మీ, భారత దేశ ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. ఫేస్ బుక్ లో ‘ఆపరేషన్ సింధూర్’ అనే ఫోటో ని ఆయన అప్లోడ్ చేసి జైహింద్ అని అనగా, పాకిస్థానీయులు వరుసగా కామెంట్స్ సెక్షన్ లోకి వచ్చి అల్లు అర్జున్ పై నిరసన వ్యక్తం చేసారు. సుమారుగా లక్షకు పైగా కామెంట్స్ వస్తే, అందులో 80 శాతం పాకిస్థానీయులవే ఉన్నాయి.
మేము మీకు పెద్ద అభిమానులం, మీ నుండి ఇలాంటి కామెంట్స్ వస్తాయని ఊహించలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిని సోషల్ మీడియా లో అల్లు అర్జున్ అభిమానులు పోస్ట్ చేస్తూ, మా హీరో కి పాకిస్థాన్ లో ఇంత క్రేజ్ ఉందా అని కామెంట్స్ చేస్తున్నారు. మొదటి నుండి పాకిస్థాన్ లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి హీరోలకు మంచి క్రేజ్ ఉంది. వాళ్లకి కూడా అల్లు అర్జున్ కి వచ్చినన్ని కామెంట్స్ రాలేదు అంటేనే అర్థం చేసుకోవచ్చు, అల్లు అర్జున్ రేంజ్ ప్రస్తుతం ఎలా ఉంది అనేది. కేవలం ఒక్క పాకిస్థాన్ లోనే కాదు, అల్లు అర్జున్ కి దాదాపుగా ప్రతీ దేశం లోనూ ఇదే రేంజ్ క్రేజ్ ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఆయన తమిళ డైరెక్టర్ అట్లీ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.