
పహాల్గామ్ దాడికి ప్రతీకారంగా మంగళవారం అర్ధరాత్రి ఉగ్రవాద స్థావరాలపై జరిపిన ఆపరేషన్ సింధూర విజయవంతం కావడంతో పాటు తర్వాత జరిగే పరిణామాలను కూడా వివరించేందుకు నేడు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమవేశం నిర్వహించనుంది. ఆపరేషన్ సిందూర గురించి వివరించడానికి అఖిలపక్ష సమావేశం నేడు జరగనుంది.
తర్వాత జరిగే పరిణామాలకు…
ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలు హాజరయ్యే ఆపరేషన్ సిందూర జరిగిన తీరు, పాక్ గడ్డపై ఉన్న ఉగ్రస్థావరాలను ఎలా మట్టి చేయగలిగింది చెప్పనున్నారు. దీంతో పాటు దీని తర్వాత జరిగే పరిణామాలకు కూడా భారత సైన్యం సిద్ధంగా ఉందని తెలియ చెప్పడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.