
ఐపీఎల్ జోష్‌లో ఎయిర్టెల్ ధమాకా
ఈ ఆఫర్ ఎయిర్టెల్ క్రికెట్ ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో భాగం. ఐపీఎల్ 2025 సందడి పెరుగుతున్న క్రమంలో ఎయిర్ టెల్ తన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, బ్రాడ్ బ్యాండ్ యూజర్ల కోసం స్పెషల్ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రత్యేక ఆఫర్ గురించి పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకందాం.
ఎయిర్టెల్ కొత్త ఆఫర్ ఏమిటి?
ఈ డిస్కౌంట్ కేవలం కొత్త బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల కోసం మాత్రమే అని ఎయిర్టెల్ స్పష్టం చేసింది. మొదటిసారి ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కనెక్షన్ తీసుకుని ఆన్లైన్లో బుక్ చేసుకుంటే, దాని మీద రూ.700 వరకు తగ్గింపు పొందవచ్చు.
డిస్కౌంట్ ఎలా పొందాలి?
ఈ ఆఫర్‌ను పొందడానికి ముందుగా ఎయిర్టెల్ అధికారిక వెబ్‌సైట్‌ను లేదా ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌ను సందర్శించి కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను బుక్ చేసుకోవాలి. అయితే, ఈ సదుపాయం కొన్ని సెలక్ట్ చేసిన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి, మీ సిటీ లేదా ప్రాంతంలో ఈ సర్వీసు ఉందో లేదో ముందుగా చెక్ చేసుకోవాలి.
ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్రత్యేకతలు
ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ 100 Mbps నుంచి 1 Gbps వరకు ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తుంది. దీనితో పాటు కంపెనీ ఉచిత వై-ఫై రూటర్, ఉచిత ఇన్‌స్టాలేషన్‌ను కూడా అందిస్తుంది. కంపెనీ సిబ్బంది మీ ఇంటికి వచ్చి స్వయంగా రూటర్‌ను ఇన్స్టాల్ చేసి వెళ్తారు. వాళ్లు ఒక్క రూపాయి కూడా ఫిట్టింగ్ ఛార్జీలను వసూలు చేయరు. అంతేకాదు, ఎయిర్టెల్ కొన్ని ప్లాన్లలో అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ వంటి OTT యాప్‌ల సబ్స్క్రిప్షన్లు కూడా ఉన్నాయి. దీని కస్టమర్ కేర్ సర్వీస్ కూడా చాలా చురుగ్గా ఉంటుంది. కంపెనీ కస్టమర్ సపోర్ట్ సర్వీస్ 24×7 అందుబాటులో ఉంటుంది.
ఇది ఒక లిమిటెడ్ టైం ఆఫర్, ఐపీఎల్ సీజన్ 2025 ముగిసే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి, కొత్త బ్రాడ్‌బ్యాండ్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే అలాంటి వాళ్లకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు.