
తెలుగుదేశం పార్టీ నేతలకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను చంద్రబాబు కొనసాగిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ ఛైర్మన్ గా గన్ని వీరాంజనేయులును చంద్రబాబు నియమించారు. ఆయన ఆప్కాబ్ ఛైర్మన్ తో పాటు ఏలూరు డీసీసీబీ ఛైర్మన్ గా కూడా కొనసాగనున్నట్లు చంద్రబాబు నాయుడు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా కామేపల్లి సీతారామయ్యను ఎంపిక చేశారు. కాకినాడ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామిని ఎంపిక చేశారు.
నామినేటెడ్ పోస్టుల భర్తీ…
ఏలూరు డీసీఎంస్ ఛైర్మన్ గా చాగంటి మురళీ కృష్ణ, ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ గా కసిరెడ్డి శ్యామల, కాకినాడ జిల్లా డీసీఎంస్ ఛైర్మన్ గా పి.చంద్రమౌళిని నియమిస్తూ చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. మహానాడు ప్రారంభమయ్యే లోపు మిగిలిన నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే పనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈరోజు, రేపట్లో మరికొన్ని నామినేటెడ పోస్టులను భర్తీ చేసే అవకాశముందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని వారికి ప్రాధాన్యత ఇస్తూ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.