
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఇంకా ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదంటూ కామెంట్ చేసింది. ఈ మేరకు ఇండియన్ ఎయర్ ఫోర్స్ ట్వీట్ చేసింది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే కాల్పుల విరమణ పాక్ ఉల్లంఘించినందుకు చేసిందా? పూర్తి స్థాయిలో వైమానికి దళానికి అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో పూర్తి చేసిందని కూడా చేసిందని తెలిపింది.
అధికారికంగా ప్రకటించేంత వరకూ…
సమర్థవంతంగా వైమానికదళం చేసిన ఆపరేషన్ పూర్తి చేసినప్పటికీ ఇంకా అప్రమత్తంగా ఉండాలని, ఆపరేషన్ కొనసాగుతూనే ఉండాలని ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేయాల్సి వచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినంత మాత్రాన ఆపరేషన్ సింధూర్ విరమించినట్లు కాదని ఎయిర్ ఫోర్స్ తన అభిప్రాయాన్ని చెప్పినట్ల యిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.