
కొత్త కారు.. గేరు మార్చి.. స్పీడుగా పోనిస్తే ఆ మజాయే వేరు.. ఇలా ఉంటది కుర్రోళ్లు కారు ఎక్కితే. అదే వారి ప్రాణాలను బలితీసుకుంటుందని, మృత్యువు పొంచి ఉందని. హైదరాబాద్ లో ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. అవుటర్ రింగ్ రోడ్డులో ఈ విషాదం జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్ ోలీసుల కథనం మేరకు బహదూర్ పుర హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన రితేశ్ అగర్వాల్ ఇటీవల కొత్త కారు కొన్నారు. ఆయన కుమారుడు రితేశ్ అగర్వాల్ తన స్నేహితులైన కార్వాన్ కు చెందిన సంచయ్ మల్సానీ, ప్రగతి నగర్ కుచెందిన ప్రియాన్ష్ మిత్తల్ తో కలసి కొత్తకారులో బయలుదేరాడు.
లారీని వేగంగా ఢీకొట్టడంతో…
శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు మీదుగా ఘట్ కేసర్ వైపునకు వెళుతుండగా గండిచెరువు వంతెన సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. లారీలోపలకి కారు దూసుకెళ్లడంతో మంటలు వ్యాపించడంతో కారులో ఉన్న ముగ్గురు యువకులు సజీవ దహనమయ్యారు. అతి వేగమే ప్రమాదానికి గల కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొత్త కారు.. కుర్రాళ్ల ఉత్సాహం… అతి వేగం.. నిర్లక్ష్యం ముగ్గురు నిండుప్రాణాలను బలికొనిందని చెప్పాలి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.