
పంజాబ్ లో హై అలెర్ట్ కొనసాగుతుంది. ప్రభుత్వం మరోసారి అనేక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసింది. పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతుండటంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అమృత్ సర్ లో మరోసారి భద్రతాదళాలు ప్రకటించాయి. సైర్లను మోగించాయి. ఇళ్లలోనే ఉండాలని, లైట్లు వేయవద్దని, బాల్కనీ, రహదారులపైకి, టెర్రస్ పైకి రావద్దంటూ భద్రతాదళాలు పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి.
కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడటంతో…
సాధారణ కార్యక్రమాలను ఎప్పుడు తిరిగి ప్రారంభించేది తెలియచేస్తామోనని తెలిపింది. ఈరోజు తెల్లవారు జామున ఈ ప్రకటన చేయడంతో పాక్ సైనికులు ఇంకా కాల్పులకు తెగపడతారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అందుకే సరిహద్దు జిల్లాల్లో తిరిగి బ్లాక్ అవుట్ ను ప్రకటించాయి. ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ భద్రతాదళాలు హెచ్చరిస్తున్నాయి. మొత్తం మీద రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఇంకా ఉద్రిక్తతలు తొలిగిపోలేదనడానికి ఇదే నిదర్శనం.