
భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల పదిహేనో తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పెరుగుతాయని తెలిపింది. మే నెల 16 లోపు అండమాన్ ను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని పేర్కొంది. మే చివరి వారంలోగా కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు అత్యంత ప్రతిభావంతంగా నైరుతి వుండే అవకాశం వుందని చెప్పింది.
మే మూడో వారం నుంచే…
మే మూడు, నాలుగు వారాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలలో వర్షాలు ముంచెత్తనున్నాయని, మొదటట కేరళలో వరదలు వచ్చే అవకాశమే ఎక్కువుగా వుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది ముందే రానున్న తొలకరి, మే నెలంతా ఎండలు అని చాలా రైతాంగం ఇంకా కళ్ళాలలోనే ధాన్యం రాశులు, కుప్పలు వుంచుకుంటే చాలా ప్రమాదమే నని చెప్పింది. ఈ పరిస్ధితికీ కారణం లానినో అండ్ పాజిటివ్ ఐడీ అని పేర్కొంది . అక్టోబర్ నుంచి ఎల్నినో పరిస్ధితులు పెరగనున్నాయి. దాని వలన ఈశాన్య రుతుపవనాలు పై ప్రభావం పడనుందని వాతావరణ శాఖ పేర్కొంది.