
2025 జనవరి లో అమెరికన్ సర్జన్ జనరల్ ప్రకారం.. లక్ష వరకు గుర్తించిన క్యాన్సర్ కేసుల్లో 20000 కేసులు మద్యం ద్వారా వచ్చిన వే అని గుర్తించారు. అలాగే అంతకుముందు 2023 సంవత్సరంలో ప్రచురించిన కొన్ని అధ్యయనాల ప్రకారం 70 శాతం మంది ఆల్కహాల్ బారినపడి ఆ తరువాత క్యాన్సర్ ముప్పునకు గురైనట్లు తేలింది.
తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ప్రతి ఏడాది 7.5 లక్షల మంది మద్యం తాగిన వారు క్యాన్సర్కు గురైనట్లు తేలింది. ఇందులో భారత్లో 62,000, చైనాలో 2.8 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నట్లు తేలింది. మద్యం తాగడం వల్ల ఎక్కువగా రొమ్ము క్యాన్సర్, పేగు క్యాన్సర్, అన్నవాహిక సమస్యలు, కాలేయ సమస్యలు, నోటి క్యాన్సర్ వంటివి గుర్తించినట్లు కొందరు పరిశోధకులు తేల్చారు.
అందువల్ల మధ్యలో ఎంతో కొంత అని అనకుండా మొత్తంగా మానివేయడమే మంచిది అని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో మధ్యలో అనేక రకాల పదార్థాలు కలుస్తున్నాయని.. ఇవి ఒక్కోసారి విషయంగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా కల్తీ మద్యం సేవించడం వల్ల ప్రాణాలకే ప్రమాదం ఉందని తెలుపుతున్నారు. మొన్నటి వరకు బ్రాండెడ్ మద్యం మంచిదనే భావన ఉండేది. కానీ ఇప్పుడు మద్యం ఏదైనా శరీరానికి హానికారమే అని తెలుపుతున్నారు.
చాలామంది మానసికంగా ప్రశాంతతకు అలాగే ఒత్తిడి నుంచి దూరం కావడానికి మద్యం సేవిస్తూ ఉంటారు. అయితే మద్యానికి బదులు ప్రత్యామ్నాయంగా ఇతర అలవాట్లు చేసుకోవాలని.. అవి ఆరోగ్యకరమైనవి ఉండాలని చెబుతున్నారు. మద్యం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అందువల్ల దీనికి దూరంగా ఉండటమే మంచిది అని చెబుతున్నారు. అయితే కొన్ని దేశాల్లో మహిళలు కూడా ఎక్కువగా మద్యం సేవిస్తున్నట్లు గుర్తించారు. ఇలా ఎక్కువగా మహిళలు మద్యం తాగిన వారిలో అధికంగా క్యాన్సర్ బారిన పడిన విషయాలు బయటకు వస్తున్నాయి. అంతేకాకుండా కొందరు సరదాగా వీకెండ్ లో తీసుకోవాలని అనుకున్న అది ముప్పుగానే పరిగణించాలని చెబుతున్నారు. అయితే ఇప్పటికే మద్యం అలవాటు ఉన్నవారు మానుకోవాలంటే మెల్లిగా దూరం కావాలని.. ఒకేసారి మద్యం మానివేయడం కూడా మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.