
ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక భేటీ ప్రారంభమయిది. ఈ సమావేశానికి త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. గత మూడు రోజులుగా పాక్ – ఇండియా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నేడు ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న కూడా పాక్ డ్రోన్లతో దాడులు చేయడం, దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్లను వినియోగించడంపై భారత్ సీరియస్ గా ఉంది.
ఉద్రిక్తతల నేపథ్యలో…
భారత్ లోని ఆలయాలు, విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినా భారత్ ఆర్మీ సమర్ధవంతంగా తిప్పికొట్టగలిగింది. అయితే మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకే పాక్ ఈ ప్రయత్నం చేసిందన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మోదీకి త్రివిధ దళాధిపతులు జరుగుతున్న పరిణామాలను వివరిస్తున్నారు. భారత్ తదుపరి కార్యాచరణపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.