
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శుక్రవారం కూడా భక్తుల రద్దీ ఎప్పుడూ ఉన్నంతగా లేదు. సాధారణంగా శుక్ర, శని, ఆదివారాల్లో తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈరోజు మాత్రం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. వేసవి రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సిఫార్సు లేఖలను కూడా స్వీకరించమని చెప్పారు. జులై పదిహేనో తేదీ వరకూ సామాన్య భక్తులకు సులువుగా దర్శనం లభించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉద్రిక్తతల నేపథ్యంలో…
అయితే దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తిరుమలలో భక్తు రద్దీ తగ్గిందనే చెప్పాలి. గత రెండు మూడు రోజుల నుంచి తిరుమలకు భక్తుల సంఖ్యత తక్కువగానే వస్తుంది. ప్రధాన కారణం పాకిస్తాన్ – ఇండియాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ముందుగా తిరుమలకు ప్లాన్ చేసుకున్న ఇతర రాష్ట్రాలకు చెందని భక్తులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్లే కనపడుతుంది. దేశంలో పరిస్థితులు చక్క బడిన తర్వాత తిరుమలకు వెళదామని భావిస్తున్నారని అనుకోవచ్చు. అందుకనే శుక్రవారం భక్తుల రద్దీ అంతగా లేదు.
22 కంపార్ట్ మెంట్లలో…
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 64,850 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,816 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.70 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.