
తెలుగు లో ఈమె ‘భరత్ అనే నేను’ చిత్రంతో మన ఆడియన్స్ కి పరిచయమైంది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది కానీ, ఆ తర్వాత రామ్ చరణ్ తో చేసిన ‘వినయ విధేయ రామ’, ‘గేమ్ చేంజర్’ చిత్రాలు డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. తెలుగు లో ఈమెకు సక్సెస్ రేట్ చాలా తక్కువే, కానీ బాలీవుడ్ లో మాత్రం ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగు లో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని, హిందీ లో ‘కబీర్ సింగ్’ పేరుతో సందీప్ వంగ రీమేక్ చేయగా, అందులో హీరోయిన్ గా కియారా అద్వానీ ని తీసుకున్నారు. ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చి సుమారుగా 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత అలాంటి సినిమాలు కియారా అద్వానీ కి కామన్ అయిపోయాయి.
అలా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈమె లేటెస్ట్ గా ‘వార్ 2′,’టాక్సిక్’ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాలకు పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ రెండు సినిమాల్లో కూడా ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయ్యింది. ఇకపోతే కియారా అద్వానీ 2023 వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా ని ప్రేమించి పెళ్లాడింది. పెళ్ళై దాదాపుగా రెండేళ్లు పూర్తి కావొస్తుంది. రీసెంట్ గా కియారా అద్వానీ గర్భం దాల్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది. రీసెంట్ గానే ఈమె బేబీ బంప్ తో ఒక ఫోటో షూట్ కూడా చేసింది. త్వరలోనే అమ్మాయికి, లేదా అబ్బాయికి ఈమె జన్మని ఇవ్వనుంది. పిల్లల్ని కన్న తర్వాత ఈమె సినిమాలు చేస్తుందో లేదో