
ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు ఒక బ్రాండ్ అయింది. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత్ జరిపిన దాడులకు ఆపరేషన్ సిందూర్ అని నామకరణం చేశారు. ఈ పేరు ట్రెండింగ్ అయింది. ఏ స్థాయిలో అంటే ఈ పేరుకు ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన పనిలేదు. సులువగా ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతానికి కూడా చేరే అవకాశముంది. అందుకే ఈ పేరు కోసం కొన్ని వ్యాపారసంస్థలు పోటీ పడుతున్నాయి. ఒకరకంగా భారత్ లోని పారిశ్రామికసంస్థలు కొన్ని ఆపరేషన్ సిందూర్ కోసం ప్రయత్నిస్తున్నాయి.
దరఖాస్తు చేసుకుని…
ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అందులో రిలయన్స్ సంస్థ కూడా ఉండటంతో తొలుత చర్చనీయాంశమైంది. అయితే రిలయన్స్ లో ఒకచిరుద్యోగి ఈ పేరు కోసం దరఖాస్తు చేశారని, తమ కంపెనీకి సంబంధం లేదని రిలయన్స్ కంపెనీ తర్వాత ప్రకటించింది. మొత్తం నాలుగు దరఖాస్తులు ఈపేరు కోసం పోటీ పడ్డాయి. ట్రేడ్ మార్క్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిందని ప్రకటన రావడంతో రిలయన్స్ సంస్థ వివరణ ఇచ్చింది. భారత్ పరాక్రమణకు చిహ్నంగా భావిస్తున్నఈ పేరు కోసం తమ సంస్థ ఉద్యోగి చేసిన ప్రయత్నాలు వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
నాలుగు సంస్థల పేరిట…
రిలయన్స్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో స్టూడియోస్ పేరిట ట్రేడ్ మార్క్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసింది. వీరితో పాటు ముంబయికి ముఖేష్ ఛత్రం అగర్వాల్, రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి, గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్, ఢిల్లీకి చెందిన అడ్వొకేట్ అలోక్ కొఠారి కూడా ఈ ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. ఆపరేషన్ సిందూర పేరు ఎంత ట్రెండింగ్ అయిందో చెప్పడానికి ఇది ఉదాహరణ మాత్రమే. అయితే ఈ పేరు ఎవరికి కేటాయిస్తారు? అసలు కేటాయిస్తారా? లేదా. అన్నదానిపై అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడల తేదు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండ్రస్ట్రీ దీనిపై ప్రకటన చేయాల్సి ఉంది. అయితే మంత్రిత్వ శాఖ వీరు దరఖాస్తు చేసుకున్నారని చెప్పింది. పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది.