
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ కూలి ఐదుగురు యాత్రికులు మరణించారు. ఉత్తరకాశీలో ఈ ప్రమాదం జరిగింది. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గంగోత్రి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. గంగోత్రి వెళ్లేందుకు ప్రయాణికులతో వెళుతున్న హెలికాప్టర్ కూలిపోవడతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.
గంగోత్రి వెళుతుండగా…
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రతాదళాలు, పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మరణించిన వారు ఎక్కడి వారన్నది తెలియాల్సి ఉంది. అయితే హెలికాపర్ట్ కూలిపోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. సాంకేతిక లోపంతోనే హెలికాప్టర్ కూలినట్లు ప్రాధమికంగా పోలీసులు నిర్ధారించారు.