
బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో కలిసి వార్ 2 (War 2) సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాని సైతం ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మరి రజినీకాంత్ కూలీ సినిమా సక్సెస్ సాధిస్తుందా? లేదంటే జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి చేస్తున్న వార్ 2 సినిమా సూపర్ సక్సెస్ ను అందుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది.
అయితే ఈ రెండు సినిమాల మధ్య తీవ్రమైన పోటీ అయితే నడుస్తుంది. ముఖ్యంగా సౌత్ లో కూలి సినిమా మీద ఎక్కువ అంచనాలు ఉంటే నార్త్ లో వార్ 2 సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాలు నువ్వా నేనా అనే పోటీకి సిద్ధమవుతున్న వేళ ఎవరు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు.
తద్వారా ఎవరి స్టార్ డమ్ అనేది భారీ రేంజ్ లో పెరుగుతుంది అనేది తెలియాల్సి ఉంది. ఆగస్టు 14వ తేదీన సినిమాలు వస్తుండడం వల్ల ఆగస్టు 15 వ తేదీ కూడా ఈ సినిమాలకి బాగా కలిసి వస్తుంది. కాబట్టి మొదటి రెండు మూడు రోజుల్లో ఎవరు భారీ రికార్డులను కొల్లగొడుతూ ఓపెనింగ్స్ ని రాబడతారు అనేది కూడా తెలియాల్సి ఉంది.