
మొత్తానికి అయితే నాగచైతన్య లాంటి స్టార్ హీరో ఏజ్ లో తన కంటే పెద్దది అయినా శ్రేయకి మామ గా నటించడం చాలా విచిత్రాన్ని కలిగించే విషయమనే చెప్పాలి. కానీ అది పునర్జన్మల కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా కాబట్టి అందులో శ్రేయ నాగ చైతన్యకి కోడలు అని చెప్పిన కూడా ప్రేక్షకులు నమ్మారు.
ఇక విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది అక్కినేని ఫ్యామిలీ యొక్క క్లాసికల్ ఫిలిం అనే చెప్పాలి. ప్రస్తుతం నాగచైతన్య కార్తీక్ వర్మ దండు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఇక కార్తీక్ దండు ఇంతకుముందు వీరూపాక్ష (Veerupaksha) అనే సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాడు.
ఈ సినిమా అందించిన సక్సెస్ తో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన ఆయన ప్రస్తుతం నాగచైతన్యతో సినిమా చేస్తూ ఇండస్ట్రీని మరోసారి షేక్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక నాగచైతన్య ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ ని పోషిస్తున్నాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.