
తెలంగాణలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ముగ్గురు పోలీసులు మరణించారు. ములుగు జిల్లా వాజేడు – పేరూరు అడవుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందిన ఘటన జరిగింది. పోలీసులను టార్గెట్ చేసి మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చారు. రోటీన్ కూంబింగ్ చేస్తున్న పోలీసుల పైకి ల్యాండ్ మైన్ను మావోయిస్టులు బ్లాస్ట్ చేశారు.
కాల్పులు జరిపి…
ఒక్కసారిగా పోలీసులపై కాల్పులు జరిపి ల్యాండ్ మైన్ పేల్చిన మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. రొటీన్ కూంబింగ్ కి వెళ్ళిన ముగ్గురు స్పెషల్ పార్టీ పోలీసులు మృతి చెందగా, మరో ముగ్గురు పోలీసులకు గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. ల్యాండ్ మైన్ పేల్చి మావోయిస్టులు కాల్పులు జరిపారు.
గాయపడ్డ పోలీసులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.