
తెలుగులో ఉన్న స్టార్ డైరెక్టర్లలో హను రాఘవపూడి (Hanu Raghavpudi) ఒకరు… మొదటి నుంచి ఆయన తన లవ్ స్టోరీస్ లో వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ వస్తున్నారు. ఇక దుల్కర్ సల్మాన్ (Dulkar Salman), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) లను హీరో హీరోయిన్ లుగా నటించిన సీతా రామం (Seetha ramam) సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా భారీ విజయాన్ని సాధించి పలు రకాల అవార్డులను సైతం సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కినప్పటికి అందులో కూడా ఒక మంచి ప్రేమ కథను అయితే చూపించాడు. ఇక ప్రస్తుతం ఆయన ప్రభాస్ (Prabhas) తో ఫౌజీ (Fouji) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సైతం ఆర్మీ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కింది. మరి ఇందులో ప్రభాస్ ను ఎలాంటి లుక్ లో చూపిస్తాడు. తద్వారా ఈ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న హను రాఘవపూడి ఈ మూవీ అయిపోయిన వెంటనే మరొక స్టార్ హీరో తో సినిమా స్టార్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఆ స్టార్ హీరో ను కలిసి కథను కూడా వినిపించారట. మరి ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అంటే రామ్ చరణ్ గా తెలుస్తోంది…ఇక రీసెంట్ గా ఆయన రామ్ చరణ్ ను కలిసి ఒక లవ్ స్టోరీ అయితే చెప్పారట. ఆ కథను విన్న రామ్ చరణ్ బాగా ఇంప్రెస్ అయిపోయారట. దాంతో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చే అవకాశం అయితే ఉంది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి.
నిజానికి రామ్ చరణ్ (Ram Charan) ippudu పెద్ది సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత సుకుమార్ (Sukumar) డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా తర్వాత సందీప్ రెడ్డివంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
మరి ఈ రెండు సినిమాల తర్వాత హను రాఘవపూడి (Hanu Raghavapudi) తో సినిమా ఉండొచ్చు అనే ధోరణిలో కొన్ని అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. మరి అప్పటివరకు హను రాఘవపూడి వెయిట్ చేస్తాడా? లేదంటే మరొక కథతో వేరే హీరోతో సినిమా చేసి ఆ తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేస్తాడా? అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…