
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిందేకు ఈరోజు మంత్రి వర్గం సమావేశం కానుంది. ప్రధానంగా సబ్ కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలపనుంది.
రాజధాని భూముల కేటాయింపులో…
అమరావతి రాజధానిలో భూముల కేటాయింపులకు ఆమోదం తెలపనుంది. అలాగే అమరావతి రీ లాంచ్ ప్రాజెక్టులతో పాటు పరిశ్రమలకు కేటాయించాల్సిన స్థలాలపై చర్చించి ఆమోదం మంత్రి వర్గ సమావేశం తెలపనుంది. ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ఆపరేషన్ సిందూర నిర్వహించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపనుంది.