ముంబయి లీగ్ కు భారత టెస్టు, వన్డే జట్ల సారథి రోహిత్ శర్మ అంబాసిడ వ్యవహరించనున్నాడు. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌తో సహా స్టార్ ఆటగాళ్లు ఈ లీగ్ కు అందుబాటులో ఉంటారని ముంబయి క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఆశిస్తోంది. 2018, 2019లలో జరిగిన ముంబయి లీగ్.. కొవిడ్-19 కార ణంగా అర్ధంతరంగా ఆగిపోయింది. సూర్య, శ్రేయస్, ఆజింక్య రహానె, శివమ్ దూబె, తుషార్ దేశ్‌పాండే, పృథ్వీ షాతో పాటు పలువురు ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లో ముంబయి తరపున ఆడు తున్నారు. ఇటీవలే యశస్వి జైశ్వాల్ ముంబయిని వీడి గోవాకు తరలివెళ్లాడు. “ముంబయి లీగ్ లో ఆడటాన్ని తప్పని సరి చేయలేదు. కాని అగ్రశ్రేణి ఆటగాళ్లంతా ఆడాలని గట్టిగా కోరుకుంటున్నాం. వారి భాగస్వామ్యంతో ముంబయి క్రికెట్ మరింత అభివృద్ధి చెందుతుంది. ఆటగాళ్లు, లీగ్ లాభపడ తాయి” అని ఎంసీఏ అధికారి తెలిపాడు. శుక్రవారం రోహిత్ సమక్షంలో జరిగే కార్యక్రమంలో ముంబయి లీగ్ పునరుద్ధరణ విషయాన్ని ప్రకటించనున్నారు. ఈ లీగ్ లో పాల్గొనే దిగ్గజ ఆటగాళ్లకు రూ.15 లక్షలు చొప్పున వేతనం చెల్లించాలని ఎంసీఏ భావిస్తున్నట్లు తెలిసింది.
