
హ్యుందాయ్ ఎక్స్టర్ ఈ కొత్త వేరియంట్ల పేర్లు S-స్మార్ట్, SX-స్మార్ట్. పెట్రోల్, సీఎన్జీ ఇంజన్ ఆప్షన్లతో పాటు, ఈ ఎస్‌యూవీలో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఇలా హ్యుందాయ్ ఒకేసారి 6 కొత్త రకాల కార్ ఆప్షన్లను ఎక్స్టర్ సిరీసులో చేర్చింది. అంటే ఇకపై కస్టమర్లకు చాలా ఛాయిస్‌లు అందుబాటులో ఉండనున్నాయి.
ఏ మోడల్ ధర ఎంతంటే?
హ్యుందాయ్ ఎక్స్టర్ S-స్మార్ట్ వేరియంట్ పెట్రోల్ ఇంజన్ మోడల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కోసం ధర రూ.7.68 లక్షలు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కోసం రూ.8.39 లక్షలు. దీని సీఎన్జీ మోడల్ ధర రూ.8.62 లక్షలు.
ఇక SX-స్మార్ట్ వేరియంట్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ ధర రూ.8.16 లక్షలు. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో దీని ధర రూ.8.83 లక్షలు, హై-సీఎన్జీ డ్యూయల్ మోడల్ ధర రూ.9.18 లక్షలు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. అంటే మీరు కొనేటప్పుడు ఇంకాస్త ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది.
హ్యుందాయ్ ఎక్స్టర్ S-స్మార్ట్ వేరియంట్లో స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, LED టెయిల్ ల్యాంప్, హైలైన్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, రియర్ AC వెంట్లు, LED DRL వంటి ఫీచర్లు ఉన్నాయి. అదే SX-స్మార్ట్ వేరియంట్లో వీటన్నిటితో పాటు షార్క్ ఫిన్ యాంటెన్నా, స్మార్ట్ కీ ఫీచర్, పుష్ బటన్ స్టార్ట్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. అంటే తక్కువ ధరలోనే మంచి ఫీచర్లను అందిస్తున్నారు.
హ్యుందాయ్ ఎక్స్టర్లో 1.2-లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 82 bhp పవర్‌ను, 113.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్ లేదా AMT ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. CNG వేరియంట్లో ఇది 68 bhp పవర్‌ను, 95.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో టాటా పంచ్‌లో ఉన్నట్టు 2-CNG సిలిండర్ టెక్నాలజీని వాడారు. దీనివల్ల కార్గో స్పేస్ కూడా పెరుగుతుంది.
మొత్తానికి హ్యుందాయ్ తన ఎక్స్టర్కు కొత్త వేరియంట్లను తీసుకొచ్చి టాటా పంచ్, మహీంద్రా XUV 3XO లకు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయింది. తక్కువ ధరలో మంచి ఫీచర్లను అందిస్తూ కస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. మరి ఈ కొత్త వేరియంట్లు మార్కెట్లో ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో చూడాలి.