
* సంపన్న వర్గాలకే పరిమితం
విదేశీ విద్య( foreign education) అనేది సంపన్న వర్గాలకే పరిమితం అయ్యే అంశం. ఎగువ మధ్యతరగతి కుటుంబాలు సైతం సాహసించి తమ పిల్లలను విదేశాలకు పంపించేవి. పేద విద్యార్థులు మాత్రం స్వదేశీ విద్యకు మాత్రమే పరిమితం అయ్యేవారు. విదేశీ విద్య అభ్యసించాలంటే ఉన్న ఆస్తిని అమ్ముకోవడం, బ్యాంకుల్లో పెద్ద ఎత్తున రుణాలు పొందడం వంటివి చేసేవారు. ఈ క్రమంలో కుటుంబ స్థితిగతులు మారిపోయేవి. ఈ క్రమంలోనే 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పేద విద్యార్థుల విదేశీ విద్య కోసం ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలని భావించారు. అంబేద్కర్ ఓవర్సీస్ ప్రత్యేక విద్యా నిధి కింద ఒక పథకాన్ని ప్రారంభించారు. వందలాదిమంది విద్యార్థులను విదేశాలకు పంపించారు.
* పథకాన్ని నిలిపివేసిన వైసిపి ప్రభుత్వం..
అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్( Ambedkar Overseas scheme ) పథకాన్ని నిలిపివేసింది. జగన్మోహన్ రెడ్డి పేరిట ఈ పథకాన్ని మార్చేసింది. అయితే నాలుగేళ్లపాటు ఈ పథకాన్ని అమలు చేయలేదు. ఎన్నికలకు ఏడాది ముందు మాత్రం హడావిడి చేసింది. మూడు పదుల సంఖ్య లోపల విద్యార్థులను విదేశాలకు పంపింది. అయితే నాలుగేళ్ల పాటు పథకాన్ని నిలిపివేయడంతో.. టిడిపి ప్రభుత్వ హయాంలో విదేశాలకు వెళ్లిన విద్యార్థులు చాలా అసౌకర్యానికి గురయ్యారు. కొందరు చెల్లించలేక ఇంటి ముఖం పట్టారు. మరికొందరు ఉన్న ఆస్తులను అమ్ముకొని సదరు విద్యాసంస్థలకు ఫీజులు కట్టారు.
* 250 యూనివర్సిటీలకు వర్తింపు
అయితే ఇప్పుడు అదే పథకాన్ని పునరుద్ధరిస్తూ చంద్రబాబు సర్కార్( Chandrababu government) కీలక నిర్ణయం తీసుకుంది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని కొనసాగించాలని డిసైడ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 250 యూనివర్సిటీల్లో చదువుకునే వీలుగా ఈ పథకాన్ని రూపొందించింది. నాలుగేళ్ల పాటు నిరాటంకంగా చదువు సాగించే వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. మొత్తానికి అయితే అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఈ పథకాన్ని అమలు చేసి.
. చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు సీఎం చంద్రబాబు.