
బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం. నిన్నటి వరకూ కొంత శాంతించిన బంగారం ధరలు తిరిగి పెరగడం ప్రారంభించాయి. గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇంకా తగ్గుతాయని వినియోగదారులు వెయిట్ చేస్తున్న తరుణంలో భారత్ – పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయంటున్నారు. అంతర్జాతీయ ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, డాలర్ బలపడటం, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో పాటు పాక్ – భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మరింతగా పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఎప్పుడూ పెరగడమే…
బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. ప్రధానంగా ఏ వస్తువుకైనా డిమాండ్ ను బట్టి ధరలు పెరుగుతాయి. కానీ బంగారం, వెండి విషయంలో మాత్రం ఇలాంటివి జరగవు. దిగుమతుల నుంచి అంతర్జాతీయంగా జరిగే పరిణామాలు కూడా బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులకు కారణమవుతాయి. అదుకే మార్కెట్ నిపుణులు తరచూ బంగారం ధరలు పెరుగుతాయని చెబుతుంటారు. ఇలా అనేక సందర్భాల్లో పెరిగిన సంగతి చూశాం. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం జరుగుతున్న సమయంలోనూ దాని ప్రభావం పడింది. అలాగే అమెరికా – చైనా ట్రేడ్ వార్ తో కూడా ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో పాక్ – భారత్ ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
బంగారం ధరలు భారీగా…
బంగారం అంటేనే అందరికీ ఇష్టం. కానీ వాటిని కొనుగోలు చేయాలంటే ధరలు అదుపులో ఉండాలి. కానీ గత కొన్ని రోజుల నుంచి ధరలు పెరుగుతుండటంతో అమ్మకాలు గణనీయంగా తగ్గాయంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర తిరిగి లక్షకు చేరుకుంది. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదయిన ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,650 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,00,70 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,07,800 గా ట్రెండ్ అవుతుంది.