
తెలంగాణలో మరోసారి భూ ప్రకపంనలు కలకలం రేపాయి. ఉత్తర తెలంగాణలో కొన్నిచోట్ల భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 3.2 తీవ్రతగా నమోదయింది. దీంతో ఇళ్లలో నుంచి జనం బయటకు భయంతో పరుగులు తీశారు. కరీంనగర్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈ భూప్రకంపనలు సంభవించాయి. ఈరోజు సాయంత్రం 6.03 గంటలకు ఈ భూప్రకంపనలు తలెత్తాయి. నిర్మల్ జిల్లా కడెం మండలంలోనూ భూమి కంపించింది.
ఆదిలాబాద్ కు సమీపంలో…
భూకంప కేంద్రం ఆదిలాబాద్ కు సమీపంలో కేంద్రీకృతమైందని అధికారులు తెలిపారు. కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, వేములవాడ, సుల్తానాబాద్, పెద్దపల్లి ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించిందని, అక్కడ రెండు సెకన్ల పాటు భూమి కంపించిందని అధికారులు తెలిపారు. గోదావరి లోయ పరివాహక ప్రాంతంలోనే ఈ భూమి కంపించిందనితెలిపింది. రిక్టర్ స్కేలు పై తక్కువ తీవ్రత నమోదు కావడంతో ఎవరూ భయాందోళనలు చెందాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్నారు