బెట్టింగ్ కు మరో యువకుడు బలయ్యాడు. అత్తాపూర్ ఠాణా పరిధిలో చోటు చేసు కున్న ఈ ఘటనకు సంబంధించి ఇన్స్పె క్టర్ నాగేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాలకు చెందిన పెద్ద నర్సింహులు కుమారుడు పవన్(22) నగరంలో ఎంటెక్ రెండో సంవత్సరం చదువుతు న్నాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి అత్తా పూర్ లో ఓ గదిలో అద్దెకు ఉంటున్నాడు..
కొంతకాలంగా బెట్టింగ్‌కు అలవాటు పడిన పవన్ నిత్యం ఓ యాప్‌లో బెట్టింగ్ ఆడుతూ భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో వివిధ యాప్‌లలో రుణాలు తీసుకుని అందులో పెట్టి నష్టపోయాడు. రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో బాధను తండ్రితో చెప్పుకోగా ఆయన పలు దఫాలుగా రూ.98,200 పంపించారు. అయినా రుణాలు తీరకపోవడంతో తండ్రి ఇప్పిం చిన రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాన్ని, ఐఫోన్‌ను విక్రయించి అప్పులు చెల్లించాడు. అయినప్పటికీ ఇంకా అప్పులు చెల్లించాల్సి ఉండటంతో తీవ్ర వేదనను గురయ్యాడు. ఈ క్రమంలోనే బుధ వారం రాత్రి గదిలో స్నేహితులు లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
