
ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనమయ్యారు. కాన్నూరులోని ఒక ఐదంతస్థుల భవనలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. చమన్ గంజ్ లో ఉంటున్న భవనంలో మంటల్లో చిక్కుకుని ఐదుగురుమరణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు.
మంటలను ఆర్పిన…
స్థానికులు అందించిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు సంభవించాయని తెలిపారు. మరైదైనా కారణమన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.