
* దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష..
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ ( MBBS ) ప్రవేశాల కోసం జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరిగింది. గత అనుభవాల దృష్ట్యా పరీక్షను పకడ్బందీగా నిర్వహించారు. మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు కాగా… ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటన్నర లోపు విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. అయితే కొందరు విద్యార్థులు రెండు నిమిషాల పాటు ఆలస్యమయ్యారు. అటువంటి వారికి పరీక్షకు అనుమతించకపోవడంతో వారు కన్నీటి పర్యంతం అయ్యారు. బాధతో అక్కడి నుంచి వెనుతిరి గారు. ముందుగానే విద్యార్థులకు స్పష్టం చేస్తామని.. నిబంధనల మేరకు నిర్దేశించిన సమయానికి పరీక్ష కేంద్రానికి వచ్చిన వారికే అనుమతి ఇచ్చామని అధికారులు చెబుతున్నారు.
* ఏడుపదుల వయసులో..
ఏపీలో 72 ఏళ్ల బామ్మ నీటి పరీక్ష రాసి అందర్నీ ఆకట్టుకున్నారు. కాకినాడకు చెందిన పోతుల వెంకటలక్ష్మి( Venkata Lakshmi ) నగరంలోని ప్రభుత్వ మహిళ పాలిటెక్నిక్ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాశారు. బామ్మ ఉత్సాహం చూసి అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. చదువుకు వయసు అడ్డంకి కాదని వెంకటలక్ష్మి నిరూపించారు. ఈ వయసులో కూడా నీట్ పరీక్ష రాయడానికి రావడంతో అందరూ బామ్మ గురించి చర్చించుకున్నారు. ఈ వయసులో కూడా చదువుకోవాలనే తపన ఉండడం చాలా గ్రేట్ అంటూ ఎక్కువమంది అభినందించారు.
* తెలంగాణలో తల్లి కూతుర్లు..
తెలంగాణలో సైతం నీటి పరీక్షలో చిత్రవిచిత్రాలు వెలుగు చూశాయి. పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థినితో పాటు ఆమె తల్లి కూడా హాజరయ్యారు. అయితే వీరిద్దరూ వేర్వేరు జిల్లాల్లో పరీక్ష రాయడం విశేషం. భూక్య సరిత ( book Kiya Sarita )అనే మహిళ ది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం మంచియా నాయక్ తండ. ఆమె ఆర్ఎంపీ గా ఉన్నారు. 2007లో బీఎస్సీ నర్సింగ్ ఫైనల్ ఇయర్ లో ఉండగా వివాహం అయింది. దీంతో ఆమె పరీక్షలు రాయలేకపోయారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు జన్మించారు. కుమార్తెను డాక్టర్ చేయాలని ఆశపడ్డారు. ఖమ్మంలో నీట్ కోచింగ్ తీసుకుంటున్న సమయంలో తల్లి సరితకు కూడా రాయాలనిపించింది. వెంటనే ఆమె కూడా పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యారు. ఈ క్రమంలో తల్లి సరిత సూర్యపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష రాశారు. కుమార్తె కావేరి ఖమ్మం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సెంటర్లో పరీక్ష పూర్తి చేశారు.