రంగారెడ్డి జిల్లా కోర్టులు : ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి యువతిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష, రూ.30,000 జరి
మానా విధించింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన జంగం నరేందర్ (20) నగరానికి వలస వచ్చి Right Mouse bu జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉంటూ తాపీ మెస్త్రి పని
చేసేవాడు.
2018లో ఇంటర్ చదివే ఓ
అమ్మాయి(17) ని ప్రేమిస్తున్నట్లు వెంటపడ్డాడు. మాయమాటలు చెప్పి, 2018 ఏప్రిల్లో ఆమెను తీసుకెళ్లి, మొయినాబాద్లో ఓ అద్దె ఇంట్లో ఉంచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆదిభట్ల పోలీ
సులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. కేసు
విచారించిన రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు గురువారం తుది తీర్పునిచ్చింది. బాధితురాలికి రూ. 4 లక్షలు పరిహారం మంజూరు చేసింది.
