
ఉత్తరాఖండ్ లో నేడు బద్రీనాధ్ దేవాలయం ఆలయల తలుపులు తెరుచుకున్నాయి. చార్ థామ్ యాత్ర ప్రారంభం కావడంతో లక్షలాది మంది భక్తులు బద్రీనాధ్ కు చేరుకున్నారు. ఉదయం గర్వాల్ రైఫిల్స్ కు చెందిన భారత ఆర్మీ భక్తి సంగీతాన్ని వినిపిస్తుండగా దేవాలయ ద్వారాలను పూజారులు తెరిచారు. తొలుత ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆలయంలోకి ప్రవేశించి ప్రత్యేక పూజలను నిర్వహించారు.
చార్ థామ్ యాత్ర సజావుగా…
చార్ థామ్ యాత్ర సజావుగా సాగేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. పహల్గామ్ దాడి ఘటనతో అప్రమత్తమైన భద్రతాదళాలు అణువణువునా గాలిస్తున్నారు. నిఘా ఏర్పాటు చేశారు. భక్తులు చార్ ధామ్ యాత్రను సజావుగా ముగించుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా చార్ ధామ్ యాత్రకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.