ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. ఈ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మీనాక్షి చౌదరి కెరియర్ వరస అవకాశాలు అందుకొని దూసుకుపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం మాత్రం ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీలో సైలెంట్ అయిపోయింది. టాలీవుడ్ లో ఈమెకు చిన్న హీరోల సినిమాలు తప్ప స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం మాత్రం రావడం లేదు. అయిన కూడా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని మీనాక్షి చౌదరి వినియోగించుకుంటుంది.
అయితే సామాజిక మాధ్యమాలలో మీనాక్షి చౌదరికి తన హైట్ మరియు శరీరాకృతి మైనస్ అయ్యాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ లకు ఉండాల్సిన సగటు హైట్ కంటే కూడా మీనాక్షి చౌదరి కొంచెం ఎక్కువ హైట్ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు ఆఫర్స్ అంతగా రావడం లేదు అంటూ ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా మీనాక్షి చౌదరి చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోషూట్స్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. రీసెంట్గా ఎల్లో కలర్ శారీలో మీనాక్షి చౌదరి షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకుంటున్నాయి.
