
రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ సక్సెస్ కావడంతో చంద్రబాబు ఆనందంగా ఉన్నారు. ఇంత పెద్ద స్థాయిలో సభ సక్సెస్ అయిన మంత్రులను చంద్రబాబు ప్రశంసించారని తెలిసింది. జనసమీకరణ చేయడం దగ్గర నుంచి టైమ్ టు టైమ్ సభ జరిగిన తీరును కూడా చంద్రబాబు అభినందించారని చెబుతున్నారు.
పని విభజన చేసుకుని…
మోదీకి గన్నవరం ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన దగ్గర నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకునేంత వరకూ నేతలు తీసుకున్న చర్యలను చంద్రబాబు ప్రశంసించినట్లు తెలిసింది. పని విభజన పక్కా చేసుకోవడం వల్లనే ఇది సాధ్యమయిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారని చెబుతున్నారు. త్వరలో జరగబోయే మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు అభినందనలు తెలియజేయనున్నారని తెలిసింది. శంకుస్థాపన నుంచి సభ వరకూ అన్నీ పకడ్బందీగా పూర్తవడంతో పాటు ఏర్పాట్లు చేసిన తీరును కూడా చంద్రబాబు అభినందించారని చెబుతున్నారు. ముఖ్యంగా మంత్రి నారాయణకు ఫోన్ చేసి ప్రశంసించారంటున్నారు.